Header Banner

తాండూరులో కలకలం రేపిన జిల్లా ఆసుపత్రి పేరు! పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు చేరుకుని..

  Tue Feb 04, 2025 12:17        Politics

వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం తీవ్ర కలకలాన్ని రేపింది. తాండూరులోని మూడు ప్రవేశ ద్వారాలు ఉండగా, ఒక ప్రవేశ ద్వారానికి సోమవారం రాత్రి కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇది గమనించిన స్థానికులు అక్కడకు చేరుకుని సిబ్బందిని నిలదీశారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు చేరుకుని ఫ్లెక్సీని చించివేశారు. విషయంలోకి వెళితే, వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు అయింది. దీనికి అనుబంధంగా 220 పడకల ఆసుపత్రిని చూపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం కొడంగల్‌లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను అధునికీకరిస్తున్నారు. మరో వారం రోజుల్లో ఢిల్లీ నుంచి జాతీయ వైద్య కమిషన్ బృందం కొడంగల్‌కు తనిఖీ నిమిత్తం రానుంది.

 

ఇంకా చదవండి: తస్మాత్ జాగ్రత్త! చియా విత్తనాలను ఈ ఆహారాలతో కలిపి ఎట్టి పరిస్థితుల్లో తీనొద్దు!

 

వారికి చూపించేందుకు తాండూరులోని 200 పగకల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పేరును కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా మారుస్తూ సోమవారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. అయితే ఈ వివాదంపై తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పందిస్తూ .. కాంట్రాక్టర్ తప్పిదం వల్లే ఇలా జరిగిందన్నారు. కొడంగల్‌లోని ఆసుపత్రికి కట్టాల్సిన ఫ్లెక్సీని తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి పొరబాటున కట్టారని తెలిపారు. దీనిపై సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు చేపట్టాలని, ఆయనకు చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేయాలని అదికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ విషయంలో తాండారు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.  

 

ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

పి అనే పదం పలకడం చేతకాని వైసీపీ నేతలు! ఓ రేంజ్‌లో ఫైర్ అయిన బీజేపీ నేత! ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తే..

 

వైసీపీకి షాక్‌ ఇచ్చిన నూజివీడు కౌన్సిలర్లు.. పట్టణంలో టీడీపీ హవా!

 

ఆ స్టార్ హీరో, డైరెక్టర్లు అవకాశాల పేరుతో పక్కలోకి రమ్మన్నారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ?

 

ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఏం తినాలి? ఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తున్న సలహా ఇదే!

 

తిరుమల రథసప్తమి ఘనోత్సవానికి టీటీడీ భారీ ఏర్పాట్లు! ఆ టోకెన్లు తాత్కాలికంగా నిలిపివేత!

 

సూర్య సినిమా ను ఫాలో అవుతున్న స్మగ్లర్లు! ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్!

 

ఫామ్ హౌస్‌లో భారీ పార్టీ... ఇద్దరూ ప్రమాదకరం.. బాబు పంచ్‌ మామూలుగా లేదుగా!

 

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #tandurdistrict #hospital #Vikarabad #District #kodangal #Telangana